లేఖనాలను అన్వేషించండి

యోబు 24: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 28:33

నీవెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.

ద్వితియోపదేశాకాండము 28:51

నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునేగాని పశువుల మందలనేగాని గొఱ్ఱమేక మందలనేగాని నీకు నిలువనియ్యరు.

న్యాయాధిపతులు 6:3

ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి

న్యాయాధిపతులు 6:4

వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు.

న్యాయాధిపతులు 6:5

వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.

న్యాయాధిపతులు 6:6

దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.

మీకా 6:15

నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు.

యోబు 31:8

నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.

సామెతలు 4:17

కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు