యోబు 29: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా
తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యెమును నాయొద్దకు తీసికొనిరావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని.
అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.
తరువాత యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు.
ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి