లేఖనాలను అన్వేషించండి

యోబు 29: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 45:26

యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.

కీర్తనలు 126:1

సీయోనుకు తిరిగివచ్చినవారిని యెహోవా చెరలోనుండి రప్పించినప్పుడు

లూకా 24:41

అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

కీర్తనలు 4:6

మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

కీర్తనలు 89:15

శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు.

యోబు 9:16

నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

యోబు 39:24

ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.

సామెతలు 16:15

రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.

సామెతలు 19:6

అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.