లేఖనాలను అన్వేషించండి

యోబు 29: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కనిపెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 72:6

గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును.

హోషేయ 6:3

యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

జెకర్యా 10:1

కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.

ద్వితియోపదేశాకాండము 32:2

నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

యోబు 32:11

ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

సామెతలు 16:15

రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.