లేఖనాలను అన్వేషించండి

యోబు 30: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 19:7

నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

యోబు 27:9

వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?

కీర్తనలు 22:2

నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

కీర్తనలు 80:4

యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగ రాజనిచ్చెదవు?

కీర్తనలు 80:5

కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు.

విలాపవాక్యములు 3:8

నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొనియున్నాడు.

విలాపవాక్యములు 3:44

మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.

మత్తయి 15:23

అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మనవెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా

యోబు 35:13

నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.