లేఖనాలను అన్వేషించండి

యోబు 32: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 6:24

నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి.

యోబు 6:25

యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?

యోబు 29:22

నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

మత్తయి 7:23

అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

మత్తయి 22:22

వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి.

మత్తయి 22:26

రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.

మత్తయి 22:34

ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడివచ్చిరి.

మత్తయి 22:46

ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

నెహెమ్యా 5:8

అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.

మార్కు 12:34

అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

1కొరిందీయులకు 14:30

అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలుపరచబడినయెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.