లేఖనాలను అన్వేషించండి

యోబు 32: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 32:11

ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై

యోబు 32:12

మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.

సామెతలు 18:13

సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

లేవీయకాండము 19:32

తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.

కీర్తనలు 119:100

నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.

ప్రసంగి 3:7

చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;