లేఖనాలను అన్వేషించండి

యోబు 39: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? "

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 10:22

సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగియుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.

2దినవృత్తాంతములు 9:21

సొలొమోను దినములలో వెండి యెన్నికకు రానిదాయెను

యోబు 30:29

నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.

లేవీయకాండము 11:19

సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.

కీర్తనలు 104:17

అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి.

యిర్మియా 8:7

ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.

జెకర్యా 5:9

నేను మరల తేరిచూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారికుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి.

కీర్తనలు 50:11

కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.

విలాపవాక్యములు 4:3

నక్కలైనను చన్నిచ్చి తమపిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.