లేఖనాలను అన్వేషించండి

యోబు 6: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 33:8

నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను.

యోబు 33:9

ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.

యోబు 33:10

ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.

యోబు 33:11

ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు.

యోబు 33:12

ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.

యోబు 42:3

జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులనుగూర్చి మాటలాడితిని.

యోబు 42:4

నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజెప్పుము.

యోబు 42:5

వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.

యోబు 42:6

కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.

యోబు 6:6

ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?

యోబు 12:11

అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?

యోబు 34:3

అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.

హెబ్రీయులకు 5:14

వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.

2సమూయేలు 14:17

మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.

2సమూయేలు 19:35

నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?

యోబు 11:4

నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.