లేఖనాలను అన్వేషించండి

లూకా 2: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 30:21

యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.

2దినవృత్తాంతములు 30:22

యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

2దినవృత్తాంతములు 30:23

యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱలనిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు

2దినవృత్తాంతములు 25:17

అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచన చేసికొని రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.