లేఖనాలను అన్వేషించండి

లూకా 2: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 22:22

ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.

ద్వితియోపదేశాకాండము 22:23

కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించినయెడల

ద్వితియోపదేశాకాండము 22:24

ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలోనుండి పరిహరించుదురు.

ద్వితియోపదేశాకాండము 22:25

ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.

ద్వితియోపదేశాకాండము 22:26

ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.

ద్వితియోపదేశాకాండము 22:27

అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలువేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.

మత్తయి 1:18

యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

మత్తయి 1:19

ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

మత్తయి 1:16

యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

మత్తయి 13:55

ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సోదరులు కారా?

లూకా 1:27

దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.