లేఖనాలను అన్వేషించండి

లూకా 7: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు యేసునొద్దకు వచ్చి నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 8:41

యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.

లూకా 9:38

ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు.

మత్తయి 8:5

ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి

యోహాను 4:47

యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను.

ఫిలేమోనుకు 1:10

నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.

ఆదికాండము 23:8

మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.

1రాజులు 14:3

కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ యేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా

మార్కు 5:23

నా చిన్నకుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా

లూకా 4:38

ఆయన సమాజమందిరములో నుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసికొనిరి.

1దెస్సలోనీకయులకు 5:13

వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.

యాకోబు 5:16

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.