లూకా 7: 49
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడాయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారు పాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అనుకొనసాగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను.
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి యున్నవని వానితో చెప్పగా,
ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.