లేఖనాలను అన్వేషించండి

మార్కు 1: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన ఆమె దగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 9:5

తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

మార్కు 5:23

నా చిన్నకుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా

యోహాను 11:3

అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

యాకోబు 5:14

మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.

యాకోబు 5:15

విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.

అపోస్తలులకార్యములు 28:8

అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థన చేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.