మార్కు 1: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడను కాను;"
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.
ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు, తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.
ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
నేతమిడత గాని చిన్నమిడత గాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును.
బాప్తిస్మమిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు.