లేఖనాలను అన్వేషించండి

మార్కు 1: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 1:25

అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా

మార్కు 3:12

తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.

లూకా 4:41

ఇంతేకాక దయ్య ములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.

అపోస్తలులకార్యములు 16:16

మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యము పట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.

అపోస్తలులకార్యములు 16:17

ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

అపోస్తలులకార్యములు 16:18

ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.

మత్తయి 8:16

సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.

మత్తయి 17:18

అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలిపోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను.

మార్కు 1:23

ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను.

లూకా 4:34

వాడు నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.

అపోస్తలులకార్యములు 16:18

ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.

అపోస్తలులకార్యములు 19:15

అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా