మార్కు 12: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
పన్ను రూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి.
అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు కైసరువనిరి.
అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి.
దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి.
అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
వారు ప్రజల యెదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది
జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవునియొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.