లేఖనాలను అన్వేషించండి

మార్కు 12: 43

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 22:4

నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయాయొద్దకు పోయి, ద్వారపాలకులు జనులయొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.

మత్తయి 10:42

మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

లూకా 12:59

నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానేరావని నీతో చెప్పుచున్నాననెను.

లూకా 21:2

ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి

2కొరిందీయులకు 8:2

ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.

2కొరిందీయులకు 8:12

మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.