నెహెమ్యా 12: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,
బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,
యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.
ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద.
లేవీయుల సమూహములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు.
మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులైయుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారైయుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.
ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.
మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.
గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.
వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతులచొప్పున కావలికాయు పని గలిగియుండెను.
గుమ్మముల కావలివారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.
వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారి వారియొద్దకు వచ్చుటకద్దు.
లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.
వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్కచొప్పున వెలుపలికి తీసికొనిరావలెను.
మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను.
యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.
లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను.
వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతిదినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.
లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.
వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.
మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగానున్న యిండ్లలోనే కాపురముండిరి.
నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)
ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.
ఆజేలునకు ఆరుగురు కుమారులుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లు గలవారు; వీరు ఆజేలు కుమారులు.
అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.