లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 12: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 6:2

సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.

1దినవృత్తాంతములు 2:54

శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.

1దినవృత్తాంతములు 9:16

యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.

1దినవృత్తాంతములు 6:32

సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించువరకు వీరు సమాజపు గుడారముయొక్క ముంగిట సంగీతసేవను ఆచరించుచుండిరి; వారు వంతులచొప్పున తమ పని చూచుకొనుచుండిరి.

1దినవృత్తాంతములు 9:22

గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.

నెహెమ్యా 3:22

అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి.