సంఖ్యాకాండము 10: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీయొద్దకు కూడిరావలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా ప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి.
సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి.
జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.
సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.
యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతనియొద్దకు వచ్చిరి.