సంఖ్యాకాండము 10: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు మోషే నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి.
రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.
మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.
శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?
అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
ఒకని భారములనొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.