లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 13: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" మోషే యెహోవా మాటవిని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 1:19

మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.

సంఖ్యాకాండము 12:16

తరువాత జనులు హజేరోతునుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.

సంఖ్యాకాండము 32:8

ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా

ద్వితియోపదేశాకాండము 1:19

మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.

ద్వితియోపదేశాకాండము 1:23

ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని.

ద్వితియోపదేశాకాండము 9:23

యెహోవా మీరువెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.

ఆదికాండము 14:6

ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత

ఆదికాండము 21:21

అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

సంఖ్యాకాండము 10:12

తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

సంఖ్యాకాండము 13:26

అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజము నొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

1సమూయేలు 25:1

సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.