లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 13: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 14:36

ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగివచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,

సంఖ్యాకాండము 14:37

అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.

ద్వితియోపదేశాకాండము 1:28

మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.

మత్తయి 23:13

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;

సంఖ్యాకాండము 13:28

అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.

యెహెజ్కేలు 36:13

ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.

ఆమోసు 2:9

దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,

2సమూయేలు 21:20

ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొకచేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.

1దినవృత్తాంతములు 20:6

మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతి చేతికి కాలి కాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.

ద్వితియోపదేశాకాండము 7:17

ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకొందువేమో, వారికి భయపడకుము.

యెహోషువ 2:24

మరియు వారుఆ దేశ మంతయు యెహోవా మనచేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.

2సమూయేలు 21:16

అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.

కీర్తనలు 44:2

నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

కీర్తనలు 106:24

వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి

సామెతలు 22:13

సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.

యెషయా 45:14

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.

యెహెజ్కేలు 36:12

మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.