సంఖ్యాకాండము 16: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందల యేబదిమందితో మోషేకు ఎదురుగాలేచి"
సంబంధిత రిఫరెన్స్‌లు
కోరహు తన సమూహములో పేరుపొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.
ఆ దినములలో నెఫీలులను వారు భూమిమీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.
తమ పితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.
నేను నీ కనుగ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్షనొందెను.
అధికారి పొరబాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల
వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
ఆ సమూహపువారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరుతెరచి వారిని కోరహును మింగివేసినందునను, వారు దృష్టాంతములైరి.
వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటినుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.
వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు