లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 16: 50

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషేయొద్దకు తిరిగివచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 16:43

మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా

1దినవృత్తాంతములు 21:26

పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

1దినవృత్తాంతములు 21:27

యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

1దినవృత్తాంతములు 21:28

యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను

1దినవృత్తాంతములు 21:29

మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.

1దినవృత్తాంతములు 21:30

దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను.

సంఖ్యాకాండము 25:9

ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.