సంఖ్యాకాండము 3: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధస్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొనిపోవుడని వారితో చెప్పెను.
అతిపరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా
దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.