సంఖ్యాకాండము 34: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ సరిహద్దు యొర్దానునదివరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపించును. ఆ దేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదైయుండునని వారి కాజ్ఞాపించుము."
సంబంధిత రిఫరెన్స్‌లు
మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా
లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమై యుండెను.
వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి
అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి
ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేలమొలకలను నాశనము చేసెను.
అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.
దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను.
అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలనుండు సిరియనుల తట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.