సంఖ్యాకాండము 34: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోషే ఇశ్రాయేలీయులతో మీరు చీట్లచేత పొందబోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీనినియ్యవలెనని ఆజ్ఞాపించెను;"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో
ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్య ములు ఇవి.
మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించి నట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.
చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.
మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నాయొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.
మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారి వారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.