సంఖ్యాకాండము 6: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱపిల్లను తీసికొనిరావలెను; తన వ్రత సంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. "
సంబంధిత రిఫరెన్స్‌లు
తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.
యాజకుడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణమునొందును.
యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.
నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి.
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు;
ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;
అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దానిగూర్చిన విధి యేదనగా
దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.
మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్రస్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను; అది పాపపరిహారార్థబలి.