సంఖ్యాకాండము 6: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమికొలది ఇచ్చుదాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దానిగూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధినిబట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము. "
సంబంధిత రిఫరెన్స్‌లు
రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవతప్పి అపవిత్రపడినయెడలనేమి,
పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.
అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.
మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.
పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱపిల్లలతో కూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.