Logo

1రాజులు అధ్యాయము 9 వచనము 16

1రాజులు 9:24 ఫరో కుమార్తె దావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.

1రాజులు 3:1 తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.

సంఖ్యాకాండము 31:10 మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.

యెహోషువ 10:33 లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.

యెహోషువ 16:10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.

న్యాయాధిపతులు 1:29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి.

1రాజులు 9:15 యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను.

1దినవృత్తాంతములు 4:18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

1దినవృత్తాంతములు 6:67 ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,