Logo

1రాజులు అధ్యాయము 9 వచనము 26

2దినవృత్తాంతములు 8:12 అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున

2దినవృత్తాంతములు 8:17 సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా

2దినవృత్తాంతములు 8:18 హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొనివచ్చిరి.

2దినవృత్తాంతములు 11:4 ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.

1రాజులు 22:48 యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.

సంఖ్యాకాండము 33:35 ఎబ్రోనాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 2:8 అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపువారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.

2రాజులు 14:22 ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

2రాజులు 2:13 మరియు ఏలీయా దుప్పటి క్రిందపడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి

2రాజులు 16:6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.

2దినవృత్తాంతములు 20:36 తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.

సామెతలు 31:14 వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.

యెహెజ్కేలు 47:7 నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.