Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 12 వచనము 2

న్యాయాధిపతులు 3:15 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

న్యాయాధిపతులు 20:16 ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు.

1సమూయేలు 17:49 తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.

2సమూయేలు 20:10 అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రి కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా

1దినవృత్తాంతములు 8:40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు.

1దినవృత్తాంతములు 12:16 మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.

1దినవృత్తాంతములు 12:29 సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.