Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 13 వచనము 11

2సమూయేలు 6:7 యెహోవా కోపము ఉజ్జామీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.

2సమూయేలు 6:9 నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి

యోనా 4:4 అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.

యోనా 4:9 అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

ఆదికాండము 32:32 అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడగూటిమీద నున్న తుంటినరము తినరు.

ద్వితియోపదేశాకాండము 34:6 బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.

యెహోషువ 4:9 అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.

ఆదికాండము 4:6 యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?

సంఖ్యాకాండము 17:13 యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.

న్యాయాధిపతులు 21:15 యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి.

1సమూయేలు 5:7 అష్డోదు వారు సంభవించిన దాని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణము గదా; అది యిక మనమధ్య నుండకూడదని చెప్పుకొని

1సమూయేలు 6:20 అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి

2సమూయేలు 6:8 యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్‌1 ఉజ్జా అను పేరు పెట్టెను.

1దినవృత్తాంతములు 15:13 ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవాయొద్ద విధినిబట్టి విచారణ చేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

1దినవృత్తాంతములు 15:25 దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.