Logo

ఎజ్రా అధ్యాయము 6 వచనము 3

ఎజ్రా 1:1 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

ఎజ్రా 1:2 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

ఎజ్రా 1:3 కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండును గాక.

ఎజ్రా 1:4 మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమయొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

ఎజ్రా 5:13 అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

ఎజ్రా 5:14 మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి

ఎజ్రా 5:15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

2దినవృత్తాంతములు 36:22 పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

2దినవృత్తాంతములు 36:23 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.

ద్వితియోపదేశాకాండము 12:5 మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.

ద్వితియోపదేశాకాండము 12:6 అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱమేకలలోను తొలిచూలు వాటిని తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:11 నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొనిరావలెను.

ద్వితియోపదేశాకాండము 12:12 మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

ద్వితియోపదేశాకాండము 12:13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ.

ద్వితియోపదేశాకాండము 12:14 యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.

2దినవృత్తాంతములు 2:6 ఆకాశములును మహాకాశములును ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపువాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను.

కీర్తనలు 122:4 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.

1రాజులు 6:2 రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.

1రాజులు 6:3 పరిశుద్ధస్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు, మందిరము ముందర అది పది మూరల వెడల్పు.

2దినవృత్తాంతములు 3:3 దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.

2దినవృత్తాంతములు 3:4 మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను.

యెహెజ్కేలు 41:13 మందిరముయొక్క నిడివిని అతడు కొలువగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడలను కొలువగా నూరు మూరలాయెను.

యెహెజ్కేలు 41:14 మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.

యెహెజ్కేలు 41:15 ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.

ప్రకటన 21:16 ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

ఎజ్రా 3:7 మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోనునుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

ఎజ్రా 4:3 అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులును మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు;మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.

ఎజ్రా 5:15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

ఎజ్రా 5:17 కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతినిగూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము.

యెషయా 44:28 కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.

యెషయా 60:10 అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

యిర్మియా 30:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.

దానియేలు 10:1 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసినదాయెను.