Logo

ఎజ్రా అధ్యాయము 6 వచనము 13

ఎజ్రా 4:9 అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్సత్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును

ఎజ్రా 4:23 రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరము యొక్క ప్రతి రెహూమునకును షివ్షుయికిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లు చేయగా

ఎజ్రా 5:6 నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు

ఎస్తేరు 6:11 ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను.

యోబు 5:12 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును

యోబు 5:13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

సామెతలు 29:26 అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.

ఎజ్రా 5:3 అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

ఎజ్రా 6:12 ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

ఎజ్రా 6:14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపు రాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

ఎజ్రా 8:36 వారు రాజు యొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.