Logo

నెహెమ్యా అధ్యాయము 7 వచనము 5

నెహెమ్యా 5:19 నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.

నెహెమ్యా 6:14 నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము.

ఎజ్రా 7:27 యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజు యొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

1కొరిందీయులకు 15:10 అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.

2కొరిందీయులకు 3:5 మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

2కొరిందీయులకు 8:16 మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.

ఫిలిప్పీయులకు 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.

ఫిలిప్పీయులకు 2:13 ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

కొలొస్సయులకు 1:29 అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తినిబట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.

యాకోబు 1:16 నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.

యెషయా 28:26 వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

నెహెమ్యా 7:64 వీరి వంశావళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.

1దినవృత్తాంతములు 9:1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారి పేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.

1దినవృత్తాంతములు 9:2 తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును.

1దినవృత్తాంతములు 9:3 యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా

1దినవృత్తాంతములు 9:4 యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.

1దినవృత్తాంతములు 9:5 షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.

1దినవృత్తాంతములు 9:6 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,

1దినవృత్తాంతములు 9:7 బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,

1దినవృత్తాంతములు 9:8 యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.

1దినవృత్తాంతములు 9:9 వీరును వీరి సహోదరులును తమ తమ వంశముల పట్టీలచొప్పున తొమ్మిదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమ పితరుల వంశములనుబట్టి తమ పితరుల యిండ్లకు పెద్దలు.

ఎజ్రా 2:62 వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.

నెహెమ్యా 11:1 జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.