Logo

నెహెమ్యా అధ్యాయము 7 వచనము 71

యోబు 34:19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వానితోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?

లూకా 21:1 కానుకపెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.

లూకా 21:2 ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి

లూకా 21:3 ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.

లూకా 21:4 వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.

2కొరిందీయులకు 8:12 మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.

యెహోషువ 6:19 వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.

ఎజ్రా 2:69 పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.

ఎజ్రా 8:1 రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునుండి నాతోకూడ వచ్చిన యింటి పెద్దల వంశావళి.