Logo

నెహెమ్యా అధ్యాయము 12 వచనము 23

1దినవృత్తాంతములు 9:14 మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,

1దినవృత్తాంతములు 9:15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,

1దినవృత్తాంతములు 9:16 యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.

1దినవృత్తాంతములు 9:17 ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహోదరులును. వీరిలో షల్లూము పెద్ద.

1దినవృత్తాంతములు 9:18 లేవీయుల సమూహములలో వీరు తూర్పుననుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు.

1దినవృత్తాంతములు 9:19 మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహోదరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులైయుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారైయుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.

1దినవృత్తాంతములు 9:20 ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.

1దినవృత్తాంతములు 9:21 మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారముయొక్క ద్వారమునకు కావలి.

1దినవృత్తాంతములు 9:22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.

1దినవృత్తాంతములు 9:23 వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతులచొప్పున కావలికాయు పని గలిగియుండెను.

1దినవృత్తాంతములు 9:24 గుమ్మముల కావలివారు నాలుగు దిశలను, అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి.

1దినవృత్తాంతములు 9:25 వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారి వారియొద్దకు వచ్చుటకద్దు.

1దినవృత్తాంతములు 9:26 లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.

1దినవృత్తాంతములు 9:27 వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.

1దినవృత్తాంతములు 9:28 వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్కచొప్పున వెలుపలికి తీసికొనిరావలెను.

1దినవృత్తాంతములు 9:29 మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను.

1దినవృత్తాంతములు 9:30 యాజకుల కుమారులలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయుదురు.

1దినవృత్తాంతములు 9:31 లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటలమీద నుంచబడెను.

1దినవృత్తాంతములు 9:32 వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతిదినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.

1దినవృత్తాంతములు 9:33 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.

1దినవృత్తాంతములు 9:34 వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.

1దినవృత్తాంతములు 9:35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.

1దినవృత్తాంతములు 9:36 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

1దినవృత్తాంతములు 9:37 గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

1దినవృత్తాంతములు 9:38 మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగానున్న యిండ్లలోనే కాపురముండిరి.

1దినవృత్తాంతములు 9:39 నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

1దినవృత్తాంతములు 9:40 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

1దినవృత్తాంతములు 9:41 మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ (ఆహాజు.)

1దినవృత్తాంతములు 9:42 ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

1దినవృత్తాంతములు 9:43 మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.

1దినవృత్తాంతములు 9:44 ఆజేలునకు ఆరుగురు కుమారులుండిరి; వారు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను అను పేళ్లు గలవారు; వీరు ఆజేలు కుమారులు.

నెహెమ్యా 3:20 అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.