Logo

నెహెమ్యా అధ్యాయము 12 వచనము 39

నెహెమ్యా 8:16 ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

2రాజులు 14:13 మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

నెహెమ్యా 3:6 పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.

నెహెమ్యా 3:3 మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులు కట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను ఆమర్చిరి.

జెఫన్యా 1:10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.

నెహెమ్యా 3:1 ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొఱ్ఱల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురమువరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి.

యిర్మియా 31:38 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.

నెహెమ్యా 3:32 మరియు మూలకును గొఱ్ఱల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.

యోహాను 5:2 యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.

నెహెమ్యా 3:25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.

నెహెమ్యా 3:31 అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.

యిర్మియా 32:2 ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,

2దినవృత్తాంతములు 25:23 అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొనివచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

2దినవృత్తాంతములు 33:14 ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.

జెకర్యా 14:10 యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టున నున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును,