దానియేలు 6:14 రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసికొని, సూర్యుడస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.
దానియేలు 6:15 ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలెననిరి.
దానియేలు 6:16 అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.
దానియేలు 6:17 వారు ఒక రాయి తీసికొనివచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.
దానియేలు 6:18 అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగనియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.
ఎస్తేరు 1:12 రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.
ఎస్తేరు 1:13 విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక
ఎస్తేరు 1:14 అతడు కాలజ్ఞానులను చూచి రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.
ఎస్తేరు 1:15 అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠములమీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు.
ఎస్తేరు 1:16 మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరియెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.
ఎస్తేరు 1:17 ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దాని విని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.
ఎస్తేరు 1:18 మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.
ఎస్తేరు 1:19 రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.
ఎస్తేరు 1:20 మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.
ఎస్తేరు 1:21 ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.
ఎస్తేరు 2:16 ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా