Logo

ఎస్తేరు అధ్యాయము 2 వచనము 3

ఎస్తేరు 1:1 అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

ఎస్తేరు 1:2 ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

ఎస్తేరు 2:8 రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను.

ఎస్తేరు 2:12 ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.

ఎస్తేరు 2:13 మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు.

ఎస్తేరు 2:14 సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్లకుండెను.

యెషయా 3:18 ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

యెషయా 3:19 కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకులను

యెషయా 3:20 కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

యెషయా 3:21 రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

యెషయా 3:22 ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

యెషయా 3:23 చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

ఎజ్రా 4:9 అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్సత్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును

ఎస్తేరు 2:5 షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను.

ఎస్తేరు 2:9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.

ఎస్తేరు 2:16 ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా

ఎస్తేరు 2:19 రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.

ఎస్తేరు 8:14 రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.