Logo

ఎస్తేరు అధ్యాయము 2 వచనము 20

ఎస్తేరు 2:10 మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి యుండెను గనుక ఆమె తెలుపలేదు.

ఎఫెసీయులకు 6:1 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే.

ఎఫెసీయులకు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,

ఎఫెసీయులకు 6:3 అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

ఎస్తేరు 4:8 వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.