Logo

ఎస్తేరు అధ్యాయము 9 వచనము 17

ఎస్తేరు 9:1 రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.

ఎస్తేరు 9:18 షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి.

ఎస్తేరు 9:21 యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మదిపొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క పదునాలుగవ దినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు

ఎస్తేరు 3:12 మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనముల భాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.

ఎస్తేరు 8:9 సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషు దేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలో నున్న అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.

ఎజ్రా 6:15 రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.

ఎస్తేరు 3:7 రాజైన అహష్వేరోషు యొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెలనెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.

ఎస్తేరు 8:16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.

ఎస్తేరు 8:17 రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందు చేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.