Logo

ఎస్తేరు అధ్యాయము 9 వచనము 18

ఎస్తేరు 9:1 రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.

ఎస్తేరు 9:11 ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియజెప్పగా

ఎస్తేరు 9:13 ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.

ఎస్తేరు 9:15 షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

ఎస్తేరు 9:17 పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి.