Logo

ఎస్తేరు అధ్యాయము 9 వచనము 21

2దినవృత్తాంతములు 30:5 కావున బహుకాలమునుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి.

ఎజ్రా 6:15 రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.

ఎస్తేరు 3:7 రాజైన అహష్వేరోషు యొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెలనెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.

ఎస్తేరు 9:17 పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందు చేసికొనుచు సంతోషముగా నుండిరి.