Logo

ఆదికాండము అధ్యాయము 13 వచనము 9

ఆదికాండము 20:15 అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.

ఆదికాండము 34:10 ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను.

కీర్తనలు 120:7 నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

రోమీయులకు 12:18 శక్యమైతే మీచేతనైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

1కొరిందీయులకు 6:7 ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?

హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు.

యాకోబు 3:13 మీలో జ్ఞానవివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

యాకోబు 3:14 అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

యాకోబు 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమువంటిదియునైయున్నది.

యాకోబు 3:16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది

యాకోబు 3:18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

1పేతురు 3:8 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

1పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

1పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

1పేతురు 3:11 అతడు కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.

1పేతురు 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

ఆదికాండము 13:11 కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి.

ఆదికాండము 16:6 అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీచేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమెయొద్దనుండి అది పారిపోగా

ఆదికాండము 47:6 ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను

సామెతలు 15:18 కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

సామెతలు 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

యెహెజ్కేలు 21:16 ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము

రోమీయులకు 12:10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.