Logo

ఆదికాండము అధ్యాయము 14 వచనము 1

ఆదికాండము 10:10 షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.

ఆదికాండము 11:2 వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

యెషయా 11:11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

దానియేలు 1:2 ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతికప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.

జెకర్యా 5:11 షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టి యుంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను.

యెషయా 37:12 నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

ఆదికాండము 10:22 షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.

యెషయా 21:2 కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

యెషయా 22:6 ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను

యిర్మియా 25:25 జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును

యిర్మియా 49:34 యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి

యిర్మియా 49:35 ఈలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.

యిర్మియా 49:36 నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయువులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.

యిర్మియా 49:37 మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడజేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారిమీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 49:38 నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములోనుండి రాజును అధిపతులను నాశనము చేయుదును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 49:39 అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 32:24 అక్కడ ఏలామును దాని సమూహమును సమాధిచుట్టు నున్నవి; అందరును కత్తిపాలై చచ్చిరి; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళములోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారు అవమానము నొందుదురు.

ఆదికాండము 14:9 అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.

యెహోషువ 12:23 గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,

2సమూయేలు 10:19 హదదెజరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.

1రాజులు 20:1 తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడివేసి దానిమీద యుద్ధము చేసెను.

1దినవృత్తాంతములు 1:17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

దానియేలు 8:2 నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను.

అపోస్తలులకార్యములు 2:9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలి వారు,