Logo

ఆదికాండము అధ్యాయము 17 వచనము 3

ఆదికాండము 17:17 అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబది యేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.

నిర్గమకాండము 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.

లేవీయకాండము 9:23 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.

లేవీయకాండము 9:24 యెహోవా సన్నిధినుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.

సంఖ్యాకాండము 14:5 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజసంఘము ఎదుట సాగిలపడిరి.

సంఖ్యాకాండము 16:22 వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.

సంఖ్యాకాండము 16:45 క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.

యెహోషువ 5:14 అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను.

న్యాయాధిపతులు 13:20 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.

1రాజులు 18:39 అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.

యెహెజ్కేలు 1:28 వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.

యెహెజ్కేలు 3:23 నేను లేచి మైదానపు భూమికి వెళ్లగా, కెబారునది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను.

యెహెజ్కేలు 9:8 నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా

దానియేలు 8:17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.

దానియేలు 8:18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.

దానియేలు 10:9 నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

మత్తయి 17:6 శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా

ప్రకటన 1:17 నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;

ఆదికాండము 12:7 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

ఆదికాండము 17:22 దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతనియొద్దనుండి పరమునకు వెళ్లెను.

నిర్గమకాండము 4:31 మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

నిర్గమకాండము 34:8 అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము చేసి

సంఖ్యాకాండము 11:17 నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొకపాలు నీతోకూడ భరింపవలెను.

1సమూయేలు 24:8 అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి

యెషయా 6:2 ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

యెహెజ్కేలు 44:4 అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొనివచ్చెను. అంతలో యెహోవా తేజోమహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా

మత్తయి 26:39 కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

మార్కు 14:35 కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు

లూకా 17:16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగివచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.